అక్షరటుడే, వెబ్​డెస్క్​: హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ వ్యాఖ్యలపై రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లే అవుట్​ చేయని వ్యవసాయ భూములను కొనుగోలు చేయొద్దని ఇటీవల రంగనాథ్​ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రియల్టర్స్ అసోసియేషన్ స్పందించింది. ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడ ఉంది అని ప్రశ్నించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉందని పేర్కొంది. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది.