అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ కార్యక్రమం ‘యువికా’కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ దరఖాస్తులు ఏప్రిల్ 23వ తేదీ వరకు సమర్పించవచ్చు. 8వ తరగతి పూర్తయిన విద్యార్థులు ‘యువికా’ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో రెండు వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణనిస్తారు.