అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు. ఢిల్లీలో భారీ విజయం సాధించిన బీజేపీ సీఎం ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేసింది. పలువురి పేర్లను పరిశీలించిన నాయకత్వం చివరికి రేఖాగుప్తాను సీఎం పదవికి ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.