అక్షరటుడే, బాన్సువాడ : ఏదైనా సాధించాలంటే ప్రతి ఒక్కరికి ఓపిక చాలా అవసరమని ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ యూత్ అధ్యక్షులు విజయ జట్టి, ఉపాధ్యక్షుడు మారిశెట్టి హనుమాన్లు, సభ్యులు భాస్కర్, సాయి, రాజు, నర్సారెడ్డి, శ్రీధర్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ పులెన్ బాబు రావు, సాయిలు భారతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.