అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: జర్నలిస్ట్‌ రంజిత్‌పై సినీనటుడు మోహన్‌బాబు దాడికి పాల్పడడంపై కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ స్టేట్‌ జర్నలిస్టు యూనియన్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ.. మోహన్‌బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ ఇలియాస్‌, జిల్లా కమిటీ సభ్యులు గోపాల్‌, రాము, వినోద్‌, నారాయణ, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.