అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యానికి గురవడంతో వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.