అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ పెద్ద మనుసు చాటుకున్నారు. తనకు యాడ్ల ద్వారా వచ్చే ఆదాయంలో పది శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ మేరకు ఆయన వీడియో పోస్ట్ చేశారు. తనకు క్రికెట్, అభిమానులు ఎంతో ఇచ్చారని.. సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఇదే మంచి సమయం అని పేర్కొన్నారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు.