అక్షరటుడే, వెబ్‌డెస్క్: మెడికల్ విద్యార్థిని హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన ఆర్జీకర్ కళాశాల మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అదే కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని అసహజ స్థితిలో మృతి చెందడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కమర్హటీలోని ఈఎస్‌ఐ హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఆర్జీకర్ విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.