అక్షరటుడే, ఆర్మూర్: జక్రాన్పల్లి మండలం తొర్లికొండ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్(27) తన స్నేహితుడితో కలిసి ఆర్మూర్ వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ప్రశాంత్ ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు సాయి ప్రశాంత్ స్వగ్రామంలోనే కార్పెంటర్ గా పని చేసేవాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.