అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మోపాల్ మండలంలోని కంజరలో శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఈఐలు కిరణ్‌కుమార్, రాహుల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్లు టీవీ రమణారెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.