అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అధికారిక పర్యటనలో భాగంగా రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జిల్లాకు రాగా, కలెక్టరేట్‌లో టీఎన్జీవో నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుమన్‌కుమార్, కార్యదర్శి శేఖర్, సహాధ్యక్షులు నాగరాజు, నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్, దినేష్‌ బాబు, జాకీర్‌ హుస్సేన్, ఉమా కిరణ్, ఇందిర, గురుచరణ్ ఉన్నారు. అలాగే, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సైతం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, ప్రశాంత్, తదితరులున్నారు.