అక్షరటుడే, వెబ్‌డెస్క్: చంద్రునిపైకి ప్రయాణించిన వ్యోమగామి ధరించిన అరుదైన రోలెక్స్ గడియారం వేలానికి సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన దివంగత వ్యోమగామి ఎగ్డార్ మిచెల్ ధరించిన వాచ్‌ను ఆర్‌ఆర్ ఆక్షన్ హౌస్ ఈనెల 24న వేలం వేయనుంది. ఇది రూ.3.35 కోట్లపైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గడియారంలో ఎరువు, నీలం రంగులు కలిసి ఉండటంతో ‘ది- జీఎంటీ మాస్టర్ పెప్సీ’ అనే పేరు పెట్టారు. మిచెల్ 1971లో అపోలో 14 మిషన్‌లో చంద్రునిపైకి వెళ్లారు. ఆసమయంలో ఆయన చేతికి ఈ గడియారం ధరించినట్లు పలు ఫొటోల ద్వారా వెల్లడైంది.