అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమృత్ స్టేషన్ పథకం కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు రూ.39.8 కోట్లు మంజూరు అయ్యాయి. ఆ నిధులతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అమృత్ స్టేషన్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి స్టేషన్‌కు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో స్టేషన్ భవన పునర్ నిర్మాణము, ప్రాంగణ అభివృద్ధి, మరో ప్రవేశం, మూడు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పలు పనులు ప్రారంభించి వేగంగా చేపడుతున్నారు.