ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఎంతో కీలకం

0

అక్షరటుడే, ఇందూరు: దేశభక్తులను తీర్చిదిద్దడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఎంతో కీలకమని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, సంఘ్ విభాగ్‌ ప్రచారక్‌ శివకుమార్‌ అన్నారు. ఆదివారం గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు నగర శాఖల సంగమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘ్ ను స్థాపించి 98 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. ఒక్క శాఖతో మొదలై ప్రస్తుతం 75వేలకు పైగా శాఖలకు విస్తరించిందని పేర్కొన్నారు. జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. కలియుగంలో ధర్మాన్ని రక్షించే వ్యక్తులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జాతీయతాభావాలు, దేశభక్తి పెంపొందాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను శాఖకు పంపాలన్నారు. కార్యక్రమంలో సుమారు 1200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. శాఖలో భాగంగా కర్రసాము, శారీరక ధృడత్వానికి సంబంధించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విభాగ్‌ కార్యవాహ దిగంబర్‌, నగర సంఘ్ చాలక్‌ శ్రీనివాస్‌, నగర కార్యవాహ అరుగుల సత్యం, బీజేపీ నాయకులు, ఆయా శాఖల కార్యవాహలు పాల్గొన్నారు.