అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ నుంచి వైద్యుడు చౌదరి, ఆయన భార్య కారులో బాన్సువాడ వస్తుండగా.. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మూలమలుపు కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.