అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వస్తున్న బస్సులో డ్రైవర్ తన దొంగబుద్ధిని ప్రదర్శించాడు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఓ మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలను డ్రైవర్ చోరీ చేస్తుండగా.. తోటి ప్రయాణికులు వీడియో తీశారు. దీంతో ప్రయాణికులు బస్ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. కిందపడితే తీసుకున్నానని బుకాయించాడు. తర్వాత వీడియో చూయించి నిలదీయడంతో తానే చోరీ చేశానని ఒప్పుకున్నాడు. ఇలాంటి వారిపై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.