అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నుంచి వరంగల్ కు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో డీలక్స్ బస్సులను పెంచినట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానీ తెలిపారు. నిజామాబాద్, వరంగల్ నుంచి ఉదయం 6-9, మధ్యాహ్నం 1-4 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక డీలక్స్ బస్సు నడుస్తుందని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.