అక్షరటుడే, ఇందూరు: ఆర్టీసీ నిజామాబాద్-2 డిపోలో బుధవారం ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి కార్తీకమాస వనభోజనం నిర్వహించారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు శంకర్, సరస్వతి, పర్సనల్ మేనేజర్ పద్మజా, అకౌంట్స్ ఆఫీసర్ పరమాత్మ, డిపో మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.