అక్షరటుడే, ఎల్లారెడ్డి : నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ లో గల త్రిలింగ రామేశ్వరాలయంలో శుక్రవారం రుద్రయాగ హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దత్తు,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.