అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. శనివారం డిచ్‌పల్లి మండలంలోని బీబీపూర్, ఖిల్లా డిచ్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీవో శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, విండో చైర్మన్ రామచంద్ర గౌడ్, వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారాం, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపెల్లి సాయి రెడ్డి, ఏవో సుధా మాధురి పాల్గొన్నారు.