అక్షర టుడే నిజామాబాద్‌ రూరల్‌ : జక్రాన్‌ పల్లి మండల కేంద్రంలో సోమవారం మండలస్థాయి పాఠశాలల క్రీడా పోటీలను రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా వాలీబాల్‌ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌, ఎంపీడీవో, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.