అక్షరటుడే, ఇందల్వాయి: మండల కేంద్రంలో ముదిరాజ్‌ కల్యాణ మండప నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తానని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి గోపి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నవీన్‌ గౌడ్, నాయకులు, ముదిరాజ్‌ సంఘ సభ్యులు, తదితరులున్నారు.