అక్షరటుడే, జుక్కల్: సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు పిట్లంలో గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులర్ చేయాలని, మినీమం టైం స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈవో దేవిసింగ్ కు సమ్మె నోటీసు అందజేశారు.