అక్షరటుడే, కామారెడ్డి: అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పేస్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల జీవిత బీమా, రూ. 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.