అక్షరటుడే, బాన్సువాడ: వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ బాన్సువాడ డివిజన్ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం బాన్సువాడ ఎంసీహెచ్ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి ఉన్న నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, సయ్యద్ అమర్ అలీ, రేణుక, సంతోష్ గౌడ్, సురేఖ, సంగీత, కళ్యాణి, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.