అక్షరటుడే, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. కాగా, డిసెంబర్ 10తో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసింది. గతంలో సంజయ్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా పనిచేశారు.