అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడలో నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమం రసాభాసగా మారింది. మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై పాల్గొన్నారు. కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డిని వేదికపైకి ఆహ్వానించడం రసాభాసకు కారణమైంది. బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ స్టేజీపై మైక్ విసిరేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే పోచారం కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల సమయం నుంచి పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజా వేదికపై వీరిరువురు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపో యినా.. కిందిస్థాయి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని చర్చ జరుగుతోంది.