అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలో నంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు. ఖిల్లా చౌరస్తాలో శనివారం సాయంత్రం నార్త్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మయ్య ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేని ఆరు వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.