అక్షరటుడే, కామారెడ్డి: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యసేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు సిబ్బంది తెలిపారు. అంబులెన్సు ఈఎంటీ అల్లె సురేష్‌, పైలట్‌ బుక్య కార్తీక్‌కు సావిత్రి భర్త సాయిలు కృతజ్ఞతలు తెలిపారు.