అక్షరటుడే, బాన్సువాడ: దివ్యాంగులు స్వశక్తితో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం దివ్యాంగులకు స్కూటీలు, చెక్కులను ఆయన అందజేశారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ భవిష్యత్ లో సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు.