అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని చేపూరు గ్రామానికి చెందిన జోరిగె నవీన్‌తో మొక్కజొన్న సీడ్ పంటను సాగు చేయడానికి సీడ్ ఆర్గనైజర్ ఏలేటి జగన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. క్వింటాలుకు రూ.3,500 చెల్లిస్తానని రాసిచ్చాడు. దీంతో నవీన్ మూడెకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. బైబ్యాక్ ఒప్పందం ప్రకారం పంటను కొనుగోలు చేయాల్సి ఉండగా సదరు ఆర్గనైజర్ ప్రస్తుతం ముఖం చాటేశాడు. పంటను అమ్ముకోలేక, కౌలు డబ్బులు చెల్లించలేక తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏజెంట్‌గా వ్యవహరించిన గ్రామానికి చెందిన గోపిడి నర్సారెడ్డి సైతం పట్టించుకోవడం లేదని వాపోయాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.