అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్తో 3 వన్డేలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీంను ప్రకటించారు. రోహిత్ శర్మ( కెప్టెన్), శుభమన్ గిల్( వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. కాగా 2023 వన్డే ప్రపంచ కప్ లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. పాక్ వేదిక ట్రోఫీ జరగనుంది. అయితే భారత్ తన మ్యాచ్లను పాకిస్తాన్లో ఆడడానికి నిరాకరించడంతో ఐసీసీ హైబ్రిడ్ విధానానికి మొగ్గుచూపింది. దీంతో టీం ఇండియా తన మ్యాచ్లను దుబాయిలో ఆడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
