అక్షరటుడే, బోధన్ : బోధన్ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ శివప్ప మృతి చెందారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా అక్కడ ఆయన మృతి చెందారు. 2009లో ఆయన బోధన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీలో జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వివిధ పదవుల్లో పనిచేశారు.