అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారులకు తప్పుడు అఫిడవిట్లు అందజేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆదె ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాక్లూర్ మండలంలో 9.16 ఎకరాలను కేవలం రూ. 4 లక్షలకే కొన్నట్లు అధికారులకు ఇచ్చిన పత్రాల్లో చూపారని.. కానీ ఆ ఆస్తి విలువ రూ. 2.70 కోట్లు ఉందన్నారు. ఇలా ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను, నగర ప్రజలను మోసం చేశారని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.