అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా భైంసా ఏఎంసీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింధే ఆనంద్‌రావు పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు భైంసా ఏఎంసీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. వైస్‌చైర్మన్‌గా ఫారూఖ్ అహ్మద్‌తోపాటు డి రామేశ్వర్, భూమన్న, మౌలామియా, తోట రాము, రాథోడ్ రాంనాథ్, జాదవ్ సురేష్, గడపాలే దేవిదాస్, సట్ల కిష్టన్న, మాధవ్‌రావు, సుధాకర్ రావు, కుంటోల్ల విఠల్, కదం దత్తురాంలను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.