అక్షరటుడే, హైదరాబాద్: మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్​లో సంచలన అంశాలు వెలుగుచూశాయి. మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తెలిసింది. హార్డ్ డిస్క్ కోసం మస్తాన్​ సాయి జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి లావణ్యపై హత్యాయత్నం చేశాడు. అక్టోబర్ 2022లో మస్తాన్​సాయి తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడు. ఆ పార్టీలో లావణ్య డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుండగా సీక్రెట్ కెమెరాలో వీడియోస్ రికార్డు చేశాడు. నవంబర్​లో మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్, మద్యం తాగించి, మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ తీశాడు. ఈ విషయం పోలీసులకు చెబితే, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మస్తాన్​సాయిపై పోలీసులు NDPS సెక్షన్​ను జోడించారు.