అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : పోలీసుశాఖలో పలువురు ఉద్యోగులు గతనెల 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు నగరంలోని సీపీ కార్యాలయంలో శనివారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలు జి.శ్రీనివాస్ రావ్, కె.నర్సయ్య, జె.రామారావు, మహ్మద్ ఆరీఫ్ ఉద్దీన్, ఏఆర్ ఎస్సైలు అబ్దుల్ సలీం, మహ్మద్ సలీమొద్దీన్, హోంగార్డు జి.నాగరాజును శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎస్బీ ఏసీపీ శ్రీనివాస్ రావ్, సీపీ ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, ఎస్బీ, రిజర్వు ఇన్ స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.