అక్షరటుడే, కోటగిరి: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పోతంగల్‌లో గ్రామస్థులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2,500 భృతి అందించాలని కోరారు. కార్యక్రమంలో బజరంగ్, రమేశ్, శంకర్, పండరి, రాములు, తదితరులు పాల్గొన్నారు.