అక్షరటుడే, కామారెడ్డి : బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం తన నివాసంలో సుమారు 120 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడంలో తాము బేషజాలకు వెళ్లమని, పేదలకు అండగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామని చెప్పారు.