అక్షరటుడే, ఆర్మూర్: భీమ్‌గల్‌కు చెందిన షాలిని శశిధర్ రావు రాష్ట్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఏజీపీ)గా నియమితులయ్యారు. మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు కూతురు షాలిని ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ఏపీ హైకోర్టు జడ్జి హరినాథ్, సీనియర్ కౌన్సిల్ సురేందర్ రావు, న్యాయవాది మదిరాజు శ్రీనివాసరావు వద్ద ఆమె వివిధ అంశాల్లో నైపుణ్యం పొందారు. ఏజీపీగా నియమించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.