అక్షర టుడే, వెబ్ డెస్క్: నాందేడ్ కు చెందిన షేక్ బాబా ఈ నెల 14న రైలులో ప్రయాణిస్తూ తప్పి పోగా, అతని ఆచూకీ కనుగొన్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ హెచ్ఓ సాయిరెడ్డి తెలిపారు. కరీంనగర్ లోని తన చిన్న కూతురు వద్దకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి నాందేడ్ కు రైలులో బయలుదేరి వెళ్లగా, నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి కనిపించకుండా పోయాడు. దీంతో అతని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, ముత్కేడ్ రైల్వేస్టేషన్ లో ఆచూకీ లభ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం అతని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.