అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నల్లమల అటవీప్రాంతంలో శివస్వాములు తప్పిపోయారు. దారి తెలియక చిమ్మ చీకట్లో ఎనిమిది గంటల పాటు అటవీప్రాంతంలో నరకయాతన అనుభవించారు. ఏ జంతువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్రీశైలానికి పాదయాత్రగా 30 మంది బయల్దేరారు. వీరిలో ఏడుగురు ఆత్మకూరు-నల్లమల సమీపంలో తప్పిపోయారు. ఎట్టకేలకు అటవీశాఖ, పోలీసు అధికారుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.