అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ఎస్సైగా శివకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నిజాంసాగర్ ఎస్సైగా తొమ్మిది నెలల పాటు పనిచేసిన సుధాకర్ లింగంపేట మండలానికి బదిలీ కాగా.. గంభీరావుపేటలో విధులు నిర్వహించిన శివకుమార్ నిజాంసాగర్ ఎస్సైగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.