అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో పేకాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు, 6 బైకులు, రూ.1,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.