అక్షరటుడే, ఎల్లారెడ్డి: పంటలకు రక్షణగా పాత చీరలను కట్టడం చూస్తూ ఉంటాం.. కానీ పాఠశాలకు అలా కట్టడం ఎప్పుడైనా చూశారా.. నాగిరెడ్డిపేట మండలం బంజారా తండాలోని డీఎన్ టీ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో చీరలను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే ఉండడంతో దుమ్ము రావడం, విద్యార్థులు దృష్టి రోడ్డుపై పడుతుండడంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు చీరలను తీసుకువచ్చి అడ్డుగా కట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు.