అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట కల్పించారు. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీంతో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఏటా రూ.80 వేల వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. ఇతర పన్ను శ్లాబుల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు టీడీఎస్ మినహాయింపులో ఊరట కల్పించారు. వడ్డీపై వచ్చే ఆదయ పరిమితిపై మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.