అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ఘటన హతినాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాణితాలిలోని వారణాసి-శక్తినగర్ హైవేపై జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఏడుగురు మహాకుంభ మేళాకు వెళ్తుండగా లారీ అదుపు తప్పి వారి కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్‌తో పాటు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.