అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళనాడులో భారీ పేలుడు చోటు చేసుకుంది. విరుద్‌నగర్ జిల్లాలోని బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం పేలుడు సంభవించగా ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.