అక్షరటుడే, బోధన్: నవీపేట మండలం బినోల సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలను సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మాండ్లు ప్రారంభించారు. నాళేశ్వర్, నిజాంపూర్, బినోల, లింగాపూర్, జన్నెపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నవీపేట తహసీల్దార్ వెంకటరమణ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.