అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ పీఏసీఎస్ ద్వారా రైతులకు నూతన రుణాలు మంజూరైనట్లు సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. 32 మంది రైతులకు రూ. 33 లక్షల రుణాలు మంజూరు కాగా, గురువారం రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.